PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచమ వార్షిక ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ ఛాయా ఉష దేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగినదిభక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణమును వీక్షించారు. మంగళహారతి ,మంత్రపుష్పం  వేద స్వస్తి నిర్వహించడం జరిగినది. మరియు రాజశ్యామల నవరాత్రుల ముగింపు సందర్భంగా రాజశ్యామల హోమము  వైభవంగా జరిగినది. హోమంలో భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని ఈ వార్షికోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.భక్తాదులు అధిక సంఖ్యలో అన్న ప్రసాదములు స్వీకరించి సూర్యనారాయణ స్వామి కృపకు పాత్రులు అయ్యారు.

About Author