ఫిబ్రవరి 2న శ్రీ వారి బ్రహ్మోత్సవాలు
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు: కర్నూలు సంకల్ భాగ్ శ్రీ దేవి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వర స్వామి 16వ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నిర్వహణలో కర్నూలు నగరం సంకల్ బాగ్, హరిహర క్షేత్రం లో వెలసిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి 16 వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికాలను బ్రాహ్మణ హితైషి పెద్దలు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ TG వెంకటేష్ గారు,వారి కుటుంభ సభ్యులతో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పవిత్ర తుంగభద్ర నది తీరం లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమన్వితుడు అని, ప్రతి సంవత్సరం బ్రహ్మాత్సవాలు ప్రారంభం రోజు ద్వజరోహన సమయం లో మరియు చక్రాస్నానం సమయం లో గరుడ పక్షులు దేవాలయం పై ప్రదక్షిణ చేస్తాయని ఇది విశేషం అని తెలిపినారు.
అలాగే ధనుర్మాసం లో సూర్య కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకుతాయని, గత 3 రోజుల నుండి ఈ విధంగా స్వామి వారికి సూర్యకిరణాల స్పర్శ జరిగిందని తెలిపినారు. అనంతరం సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర రావు మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 2వ తేదీ ద్వజరోహనం తో మొదలు అయి 11 వ తేదీ స్వామి వారి కళ్యాణం,12 వ తేదీ చక్రాస్నానం తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపినారు. బ్రహ్మోత్సవ సమయం లో దేవాలయం ప్రతి రోజు విశేష పూజలు, పంచామృత అభిషేకలు మరియు భక్తుల వివిధ రకాల కోరికలకు ప్రతిరోజు హోమం, అన్నదానం కార్యక్రమం, వాహన సేవ లు నిర్వహించడం జరిగితుందని. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి కృప కు పాత్రులు కావాలేనని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో కర్నూలు బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మరియు వాయు సేన సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.