ఏప్రిల్ 12 న శ్రీ వీర హనుమాన్ విజయ శోభా యాత్ర
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 12 వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించబోయే శ్రీ వీర హనుమాన్ విజయ శోభా యాత్ర, బలోపాసన దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 14-3-25 శుక్రవారం హోలీ పండగ సందర్బంగా 1టౌన్ జమ్మిచెట్టు శ్రీ లలితా పీఠం నందు పూజ్య స్వామీజీ శ్రీ మేడా సుబ్రహ్మణ్యం స్వామి వారి దివ్య ఆశీస్సులతో వందలాదిమంది మాతృ మూర్తులచే జరిగే లలితా సహస్ర నామ పారాయణం మరియు అమ్మవారి హోమం కార్యక్రమం మధ్యలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభా యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ T. C. మద్దిలేటి మాట్లాడుతూ హిందూ బంధువులు అందరిని సంఘటితం చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని హిందూ ధర్మానికి ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా ఈ విశ్వ హిందూ పరిషత్ ముందు ఉండి పోరాడుతుంది అని యువకులు అందరు ఈ బజరంగ్ దళ్ సంస్థలో చేరి ధర్మారక్షణకై పోరాడాలని యువకులకు పిలుపునిచ్చారు, అలాగే దక్షిణాంద్ర ప్రాంత విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ తూముకుంట ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క శోభా యాత్రను కనీసం 15000 నుంచి 20000 సంఖ్యతో విజయవంతం చేయాలని అందుకొరకై బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరు సమిష్టి కృషి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమానికి వీహెచ్పి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ గోవింద రాజులు , ప్రాంత కోశాధికారి శ్రీ సందడి మహేష్ గారు,విభాగ్ విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ నీలి నరసింహ ,వరసిద్ధి వినాయక ప్రఖండ ఉపాధ్యక్షులు శ్రీ బాబురావు , జిల్లా ప్రచార ప్రసార ప్రముఖ్ రామకృష్ణ , బజరంగ్ దళ్ కర్నూలు జిల్లా సహ సంయోజక్ శ్రీ తెలుగు భగీరథ, జిల్లా సాప్తాహిక్ మిలన్ ప్రముఖ్ మండ్ల హరికృష్ణ, సురక్ష ప్రముఖ్ శివసాయినాథ్ చామిరాజు, గుంపిలి భాస్కర్, రాఘవేంద్ర స్వామి ప్రఖండ కన్వీనర్ యశ్వంత్, రామాలయ ప్రఖండ కన్వీనర్ సింహాద్రి, దస్తగిరి, రామకృష్ణ, బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.