ఈ నెల 12 శ్రీ విజయ దుర్గ దేవి జాతర వేడుకలు
1 min read
అన్ని ఏర్పాట్లు చేస్తున్న గ్రామ సర్వసద్భక్త మండలి పెద్దలు
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని రచ్చుమర్రి మాధవరం గ్రామాల మద్య వెలసిన శ్రీ విజయ దుర్గ దేవి (మారెమ్మ అవ్వ)4 వ జాతర వేడుకలు ఈనెల 12 తేదీన ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రెండు గ్రామాల సర్వసద్భక్త మండలి సభ్యులు ఈ గోవింద్ గౌడ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 12 వ తేదీన సోమవారం ఉదయం విజయ దుర్గ దేవి కి గంగ పూజ, పంచామృతభిషకం, అభిషేకం, ఆకు పూజ, మంగళహారతి, మహనైవేద్యం పూజ వంటి వివిధ రకాల పూజలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం రెండు గ్రామాల ప్రజల అధ్వర్యంలో దుర్గ దేవి ప్రతిమ ను రథోత్సవం పై ఆశీనులు చేసి డప్పుల బాణాసంచా కాల్చి ప్రజల హర్షధ్వనుల మద్య రథోత్సవం ఊరేగింపు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ జాతర వేడుకల్లో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.