శ్రీచక్ర పత్రిక కాపీ రైట్ ఉల్లంఘన..
1 min read– ఇదే అన్న రెండు అక్షరాలు జోడించి అక్రమాలు
–నకిలీ ఆర్ఎన్ఐ నంబర్ తో ప్రచురణ
– ముగ్గురిపై కేసు నమోదు.. నిందితుల్లో ఒక మహిళ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరానికి చెందిన కె. హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదరణ పొందిన శ్రీచక్ర దిన పత్రికను ఇదే అన్న రెండు అక్షరాలు జోడించి కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ముగ్గురిపై కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమొదు అయ్యింది. శ్రీచక్ర పేరుకు ముందు “ఇదే” అన్న రెండు అక్షరాలు జోడించి డూప్లికేట్ ఆర్ఎన్ఐ నంబరుతో పత్రిక ప్రచురణకు పాల్పడుతున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ నిర్వహించారు. ఈ మేరకు కడప జిల్లా బ్రహ్మంగారిమఠం గ్రామానికి చెందిన అంకిరెడ్డి పల్లె రామ్మోహన్ రెడ్డి, అనంతపురం నగరంలోని తపోవనం కాలనీకి చెందిన బెస్త శంకర్ ప్రసాద్ తో పాటు విజయవాడకు చెందిన బి. సుభాషిణి అనే మహిళలపై ఎస్ఐ ఎంఎ ఖాన్ ఎఫ్ఐఆర్ నంబర్ 69/2023 తేదీ 01-05-2023న కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరు ముగ్గురు గత కొంత కాలంగా ఇదే శ్రీచక్ర పేరుతో పత్రికను ప్రచురిస్తూ విలేకర్లతో పాటు పాఠకులను మోసం చేస్తున్నారు. మొదటగా ఇదే శ్రీచక్ర పెరుతో బి. సుభాషిణి యజమానిగా, శంకర్ ప్రసాద్ ఎడిటర్ గా మోహనేస్వర పబ్లికేషన్, ఇంటి నెంబర్ 59-2-1, ఈశ్వర్ బిల్డింగ్, పాత 5 బస్ రూట్, మొగలరాజపురం, విజయవాడ పేరుతో శ్రీచక్ర పేపర్ ను నకిలీ ఆర్ఎన్ఐ నెం. ఏపీటీఈయల్ /3622/23 తో ప్రచురించి సామాజిక మాధ్యమాలలో పీడీఎఫ్ చేసి అందరికీ షేర్ చేస్తున్నారు. అదే చిరునామతో ఏడిటర్ గా రామమోహన్ రెడ్డి పేరుతో మరో పత్రికను కూడా పబ్లిష్ చేస్తున్నారు. ఈ పత్రికలలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తమ అక్రమాలకు సహకరించని కొంతమంది విలేకర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్న విషయాన్ని వారు శ్రీచక్ర దిన పత్రిక వాస్తవ యజమాని హరినాథ్ రెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయారు. రామమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తినైనా ఇట్టే మోసం చేయడంలో దిట్ట అని మాయ మాటలు చెప్పి డబ్బు వసూలు చేయడంలో శంకర్ ప్రసాద్ ఘనుడు అని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఒక ప్రముఖ దిన పత్రికలో పని చేసిన సందర్భంలో సైతం శంకర్ ప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఈ విషయంపై శ్రీచక్ర దిన పత్రిక ఎండి యజమాని హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మోసగాళ్లపై ప్రతి జర్నలిస్ట్ నిఘా వేసి ఉంచాలని కోరారు. అవసరమైతే వెంటనే పోలీసులకు పిర్యాదులు చేసి వారి ఆటలు కట్టించాలని సూచించారు. తన పత్రిక పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని పిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర విచారణ అనంతరం కేసు నమోదు చేశారు. మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారని ఆయన అన్నారు.