శివనామస్మరణతో శ్రీగిరి
1 min readపల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. శ్రీశైలమహా క్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది సెలవు దినం కావడంతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు రావడంతో భక్తులు కుటుంబసమేతంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మ తల్లికి కార్తీకదీపాలు వెలిగించి, మొక్కు తీర్చుకుంటున్నారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. స్వామివారి అభిషేకం కర్తలకు అలంకార దర్శనం ఉంటుందని ఆలయ ఆలయ అధికారులు తెలియజేశాడు భక్తులు దీపారాధనగంగాధర మండపం వద్ద మరియు శివాజీ గోపురం వద్ద ఉన్న శివ మాడవీధిలో భక్తులు అధిక సంఖ్యలో దీపారాధన చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవో లవన్న ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు ప్రసాదాలను భక్తులు అవసరమైన లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచారు.