PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీకాంత్​ రెడ్డి సేవలు.. ఆదర్శం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: పట్టణంలోని మార్కెట్​ యార్డు అవరణములో కమిటీ చైర్మన్ అన్వర్ బాష, వైస్ చైర్మన్ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీ కాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్​ కట్​ చేసి కార్యకర్తలు, నాయకులకు పంచారు. అనంతరం పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీకాంత్​ రెడ్డి భవిష్యత్తు లో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అకాక్షించారు. ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న సేవలు ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అసిఫ్ ఆలీ ఖాన్, కొలిమి హరూన్ బాషా, ఛాన్ బాషా, బెపారి మహమ్మద్,13 వార్డ్ ఫయాజ్, సుగవాసి శ్యామ్,వాతన్ నిసర్,జూల్లు ఫక్కీర్, విక్కీ, కొత్తిమీర ప్రసాద్, జవీద్, సురేష్ కుమార్ రెడ్డి పాల్గున్నారు.

About Author