భక్తులతో కిటకిటలాడిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం
1 min read
నిత్య అన్నదాన పథకానికి పలువురు దాతలలు విరాళాలు
శ్రీమద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న పూర్వపు దేవదయ కమిషనర్ ఎం.పద్మ
ఆలయ మర్యాదలతో ఆమెకుస్వాగతం
కార్యనిర్వహణాధికారిని ఆర్.వి చందన
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని ఈరొజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఛైర్మన్,పూర్వపు దేవదాయశాఖ కమిషనరు ఎం.పద్మ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, పర్యవేక్షకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామివారి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపంవద్ద వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, పర్యవేక్షకులు రంగారావు వారికి స్వామివారి శేషవస్త్రములు, ప్రసాదములు అందజేశారు. మరియు ఆలయము వద్ద నిర్వహించుచున్న నిత్యాన్నదానమునకు తాడేపల్లిగూడెం నకు చెందిన గుత్తికొండ ప్రసన్న లక్ష్మి కౌసల్య రూ.1,00,001/-లు, దూబచర్లకు చెందిన వర్ధినీడి చిరంజీవి ధర్మతేజ కుటుంబ సబ్యులు రూ.22,500/- లు విరాళముగా సమర్పించారు. వారిని పర్యవేక్షకులు రంగారావు ఆలయమర్యాదలతో సత్కరించి, స్వామివారి శేషవస్త్రములు, ప్రసాదములు అందజేశారని సహాయ కమిషనరు , కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.
