శ్రీమూల పెద్దమ్మ జాతర… బోనాలతో నైవేద్యం..
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: మండల కేంద్రంలో వెలిసిన శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారి జాతర ఆదివారం రామన్న బావి వద్ద ఘట్టానికి వెళ్ళి బోనాలతో భక్తులు అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన ఆకు పూజలు నిర్వహించారు దీంతో అమ్మవారి జాతర మొదలైనట్టు సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆలయ ఈవో నాగప్రసాద్ ఆలయ చైర్మన్ చిన్నన్న తెలిపారు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల సౌకర్యం వేసవి దృష్ట్యా దాతలు దాదాపు రెండు లక్షల 30 వేలతో శాశ్వత పైకప్పులు ఏర్పాటు చేశారు గత రెండు సంవత్సరాల నుండి కరోనా నేపథ్యంలో జాతర జరగకపోవడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు జెఎస్డబ్ల్యు ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రం భక్తులకు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు ముగ్గురు ఎస్ఐలతో జాతరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు గడివేముల ఎస్సై హుస్సేన్ భాష పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి నందవరం ఎస్సై రామాంజనేయరెడ్డి అదనపు బలగాలతో పోలీస్ సిబ్బంది జాతరకు ఎటువంటి ఆటంకం కలగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.