శ్రీరంగాపురం అభివృద్ధికి..రూ.1.35 కోట్లు మంజూరు
1 min readఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి రుణపడి ఉంటాం..
- శ్రీరంగాపురం కాంగ్రెస్ నాయకులు
శ్రీరంగాపురం, పల్లెవెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడవక ముందే… అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తోందన్నారు శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ నాయకులు. శ్రీరంగాపూర్ మండల అభివృద్ధి కోసం NREGS నిధుల క్రింద ₹1.35(ఒక కోటి ముప్పై ఐదు లక్షలు) వనపర్తి నియోజకవర్గ MLA తూడి మేఘా రెడ్డి మంజూరు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. బుధవారం శ్రీరంగాపూర్ మండల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తమ మండలానికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే నాలుగు పెద్దపెద్ద భవనాలు కట్టడం కాదని.. గ్రామాలలో… పట్టణాలలో జరిగితే దానిని అభివృద్ధి అంటారని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక నమ్మకం… కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుంది… చేసేదే చెప్తుందని, అందుకు నిదర్శనం .. మేఘ రెడ్డి అని పేర్కొన్నారు. శ్రీరంగాపూర్ మండలంలో పలు సిసి రోడ్లకు మేఘా రెడ్డి 1 కోటి 35 లక్షలు రూపాయలు మంజూరు చేయడం హర్శించదగ్గ విషయమన్నారు. ., ఇందుకు శ్రీరంగాపూర్ మండల ప్రజలు మెగా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి గారు మండల BC సెల్ అధ్యక్షులు పలుస రాజా గౌడు గారు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగ కురుమన్న గారు, మండల SC సెల్ ప్రధానకార్యదర్శి జమ్మన్నగారి ఆశన్న గారు, SC సెల్ కోశాధికారి రంజిత్ కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు చిన్న గోవిందు గారు నాయకులు విజయకుమార్ రెడ్డి గారు మండల యువనాయకులు గొల్లవాళ్ళ పరుశరామ్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని ఈసందర్బంగా MLA గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.