PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు​ – ముస్తాబయిన తిరుమల

1 min read

పల్లెవెలుగువెబ్​, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 7వ తేదీ సాయంత్రం ధ్వజారోహణతో ప్రారంభమై 15వ తేదీ దాకా కొనసాగుతాయి. ఈమేరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాలు ముస్తాబవుతునానయి. కోవిడ్​–19 ముందస్తు నివారణ నియమావళికి అనుగుణంగా శ్రీవారి ఉత్సవాలు నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 6వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఉత్సవ రోజుల్లో శ్రీవారికి పలు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు…
అక్టోబరు 6వ తేదీన సాయంత్రం 6గంటలకు అంకురార్ప‌ణ, 7న ధ్వజారోహణ, 8న ఉదయం చిన్నశేషవాహనసేవ, రాత్రి హంసవాహనసేవ, 9న ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపుమందిరి సేవ, 10న ఉదయం కల్పవృక్ష వాహనసేవ, రాత్రి స్వరభూపాల వాహనసేవ, 11న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడవాహనసేవ, 12న ఉదయం హనుమంత వాహనసేవ, సాయంత్రం సర్వభూపాల వాహనసేవ, రాత్రి గజవాహనసేవ, 13న ఉదయం సూర్యప్రభ వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహనసేవ, 14న సర్వభూపాలవాహనసేవ, రాత్రి అశ్వవాహనసేవ, 15వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.
టిక్కెట్టు ఉంటేనే….తిరుమలకు రండీ..
శ్రీవారి దర్శన టిక్కట్లు ఉంటేనే తిరుమలకు రావాలని తితిదే కోరుతోంది. కరోనా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా తితిదే అధికారులు ఈమేర నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో అలిపిరి వద్ద భక్తులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దర్శనం టిక్కెట్లు లేని భక్తులను అక్కడి నుంచే వెనక్కి పంపిచేస్తున్నారు. భక్తులు దర్శనం టిక్కెట్లతోపాటు కోవిడ్​ వ్యాక్సినేషన్​ పత్రం లేదా 72గంటల ముందు ఆర్​టీపీసీఆర్​ నెగటీవ్​ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. తిరుమలకు టిక్కెట్లు లేని భక్తులు సైతం పెద్దసంఖ్యలో తరలివస్తుండడంతో కోవిడ్​ సమస్యలను దృష్టింలో ఉంచుకుని అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

About Author