NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపటి నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరం లో సంకల్ భాగ్ హరిహర క్షేత్రం లో వెలసిన శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి 16 వ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి అనగా 02-02-2022 వ తేదీ ధ్వజారోహణతో మొదలై 11. 02. 2022 వ తేదీ శ్రీవారి కళ్యాణం,12 02 2022 చక్రాస్నానం తో ముగుస్తాయని, ప్రతిరోజు శ్రీవారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, హోమాలు, సాయంత్రం దీపాలంకరణ సేవా, మరియు వివిధ వాహనాల పై పురవీధుల గుండా ప్రజలకు దర్శనం ఇస్తారు అని, భక్తులు ఈ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలి అని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తెలిపారు. భక్తులు మాస్క్ లు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించవలెను అని తెలిపినారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు మాధవ ప్రభు, దేవాలయం అర్చకులు వెంకటేశ్వర ప్రసన్న శర్మ,సాయి కుమార్ శర్మ, రాఘవేంద్ర రావు పాల్గొన్నారు.

About Author