సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలలో యువజనోత్సవాలు..
1 min read– విజేతలకు సర్టిఫికెట్స్ , మెమొంటోస్ అందజేత..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము యువజన సర్వీసుల శాఖ, సిట్ వెల్, ఏలూరు వారి అధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవములు సిహెచ్. యస్. డి.సెయింట్ థెరిసాస్ మహిళా డిగ్రీ కళాశాల, ఏలూరు లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో ట్రిపుల్ ఐ. టి. నూజివీడు, సెయింట్ థెరిసాస్ మహిళా డిగ్రీ కళాశాల మరియు సర్. సి. ఆర్. ఆర్ కళాశాల విద్యార్థులు జానపద నృత్యం, గీతం గ్రూపు, జానపద నృత్యం, గీతం వ్యక్తిగతం, స్టోరెరైటింగ్, పోస్టర్ పెయిటింగ్ & ఫోటోగ్రఫీ అంశములలో పోటీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ప్రధమ ద్వితీయ మరియు తృతీయ బహుమతులు పొందిన విజేతలకు సర్టిఫికెట్స్ మేమెంటోస్ అందచేశారు .ఈ కార్యక్రమానికి ఎం.డి.హెచ్. మెహరాజ్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సెట్ వెల్, జిల్లా యువజన సర్వీసుల శాఖ, ఏలూరు, కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ పి. మెర్సి , పి.వి.యన్. సత్యనారాయణ సెట్ వెల్ మేనేజర్, యస్ .పట్టభిరామన్న, పర్యాటక శాఖ మేనేజర్ ఏ.ఓ. కె. జాన్ కెనడీ, జునియర్ సహాయకులు పసుపులేటి ప్రసాద రావు హాజరయ్యారు. ఈ పోటీలలో శ్రీ జి. రాజేష్ డ్యాన్స్ మాష్టారు, టి. పద్మకుమారి మ్యూజిక్ మాష్టారు, గంగా భవాని , రంగూన్ స్టూడియో బాలజీ, సురేంద్ర (పెప్సీ)న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.