‘స్టేడియం’ ప్రైవేటీకరణ ఆపాలి: డీవైఎఫ్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూల్ నగరంలోని జిల్లా అవుట్ డోర్ స్టేడియం ముందు స్టేడియాల ప్రైవేటీకరణ ఆపాలని పే అండ్ ప్లే ఆప్షన్రద్దు చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోచ్లపై ఒత్తిడి తగ్గించి… క్రీడలకు బడ్జెట్ కేటాయించి.. క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. శుక్రవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి హుస్సేన్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ప్రవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు సుంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాల ప్రైవేటీకరణ పే అండ్ ప్లే విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల పేద క్రీడాకారులను రోజు వ్యాయామం చేసుకునే వారికి స్టేడియాలను దూరం చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి వారిపైన ఆర్థిక భారాన్ని మోపడం ఎంతవరకు సభాపతి ప్రశ్నించారు. ఇప్పటికే కర్నూలు నగరంలోని స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం జోరాపురం చేడియాలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని తెలిపారు. తక్షణమే స్టేడియాల ప్రైవేటీకరణ ఆపాలని పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేయాలని వ్యాయామం చేసేవారి నుండి డబ్బులు వసూలు చేయడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రంగప్ప నాయకులు భరత్ వేణు విక్రమ్ బాబి చరణ్ రమేష్ అంజి క్రీడకారులు పాల్గొన్నారు.