NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందించాలి

1 min read

అందిన ప్రతీ పోస్టల్ బ్యాలెట్ ను సీలు పరిశీలించి తీసుకొని నమోదు చేసుకోవాలి

జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల విధులలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్  వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు.  స్థానిక కలెక్టరేట్ లో  గురువారం ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి  పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందిలో అర్హులైన ప్రతీ ఒక్క సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా  తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు  సదరు సిబ్బందికి పోస్టల్ పత్రాలను అందించి వాటి వివరాలను సదరు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.  పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందించేందుకు 20వ తేదీ చివరి తేదీ కావున అందిన పోస్టల్ బ్యాలెట్ లకు నిబంధనల మేరకు  సీలు సరిగ్గా ఉన్నది, లేనిది సరిచూసుకుని తీసుకొని, నమోదు చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్  ప్రక్రియను పరిశీలించాలని నోడల్ అధికారి మరియు జిల్లా సహకారశాఖాధికారి శ్రీనివాస్ ను జేసీ ఆదేశించారు.  జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విజయకుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author