నిలిచిపోయిన రేషన్ ట్రక్కులు -విధులకు హాజరు కాలేమంటున్న ఆపరేటర్లు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో రేషన్ ట్రక్కులు (ఎండియు ఆపరేటర్లు) సమస్యల వల్ల మేము విధులు నిర్వహించడం కష్టంగా ఉందని చెప్పేసి ఆపరేటర్లు రేషన్ వాహనాలను మిడుతూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉంచారు.ఈనెల 5వ తేదీ నుంచి సర్వర్ ప్రాబ్లం వల్ల ఈ పాస్ మిషన్లు పని చేయక రేషన్ తీసుకునే కార్డుదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా ప్రజలు అసహనానికి గురవుతున్నారని మండలంలో ఇప్పటివరకు 28% మాత్రమే రేషన్ పంపిణీ చేయడం జరిగిందని ఇంకా 73 శాతం పంపిణీ చేయవలసి ఉందని సర్వర్ సమస్య క్లియర్ అయ్యేలాగా లేదా ఆఫ్ లైన్లో రేషన్ ఇవ్వడానికి అవకాశం కల్పించాలని గ్రామాల్లో మా మీదికి కార్డుదారుల ఎటువంటి దాడులు జరగకుండా భద్రత కల్పించాలని రెండుసార్లు పంపు ఉండటం వల్ల కార్డుదారుల నుండి తంబు పడకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఎండీయూ ఆపరేటర్లు సోమవారం మధ్యాహ్నం మిడుతూరు ఎంపీడీవో కార్యాలయంలో స్పందనలో తహసిల్దార్ ఎస్ ప్రకాష్ బాబుతో ఎండియు ఆపరేటర్లు మాట్లాడారు.మా సమస్యలను పరిష్కరించే దాకా విధులకు హాజరు కాలేమని తహసిల్దార్ తో వారు అన్నారు.అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.9వ తేదీ వచ్చినా కూడా ఇంతవరకు రేషన్ పంపిణీ చేయలేదని మండల బిజెపి అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అన్ని గ్రామాలలో రేషన్ పంపిణీ చేయుటకు తన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.తహసిల్దార్ కు వినతిపత్రం అందించిన వారిలో షఫీ,వెంకటేశ్వర్లు, మధు బాబు,రాజు,చంద్రమౌళి,సాంబశివుడు,రాంప్రసాద్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.