PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాండ్‌ అప్‌ రాహుల్‌

1 min read

సినిమా డెస్క్​: పోయినేడు ఓటీటీలో ‘ఒరేయ్‌ బుజ్జిగ’ మూవీతో హిట్‌ కొట్టాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. రీసెంట్‌గా వచ్చిన ‘పవర్‌‌ ప్లే’ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా మంచి వ్యూసే దక్కించుకుంది. తాజాగా తను నటిస్తున్న ‘స్టాండ్ అప్ రాహుల్’ కూర్చుంది చాలు.. అనే ట్యాగ్‌ లైన్‌తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన రాజ్ తరుణ్ -వర్ష ఫస్ట్ లుక్‌లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘స్టాండ్ అప్ రాహుల్’ టీజర్ ను రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందించారు. జీవితంలో దేనికోసం నిలబడని ఓ యువకుడు.. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాక.. తన తల్లిదండ్రుల కోసం.. ప్రేమ కోసం రాహుల్ స్టాండ్- అప్ కామెడీనీ ఎన్నుకుంటాడు. దాన్ని నిలబెట్టుకోవడం ఏం చేశాడనేదే కథ. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ బ్రో’ అనే లైన్ ని చూపిస్తూ.. రాజ్ తరుణ్ ఓ స్టేజ్ పై మాట్లాడుతుండటంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. కామెడీ పండించడం కోసం రాజ్‌ తరుణ్ పడే పాట్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ‘ఒక అబ్బాయి సింగిల్ గా ఉంటే పులి అవుతాడు. అదే అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్స్‌ ఇంట్రెస్టింగ్‌ ఉన్నాయి. దానికితోడు మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న వెన్నెల కిషోర్ పాత్ర కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది. మురళి శర్మ, – ఇంద్రజ, – దేవి ప్రసాద్ – మధురిమ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

About Author