స్టాండింగ్ కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషిచేయాలి: మేయర్ షేక్ నూర్జహాన్
1 min readఉపముఖ్యమంత్రి ఆళ్ల నానికి కృతజ్ఞతలు స్టాండింగ్ కమిటీ సభ్యులు
పల్లెవెలుగు వెబ్, ఏలూరు: స్టాండింగ్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులందరూ ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్, 16వ డివిజన్ కార్పొరేటర్ జిజ్జువరపు విజయ నిర్మల,30 డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు,32వ డివిజన్ కార్పొరేటర్ బండారు సునీత రత్నకుమారి,48వ డివిజన్ కార్పొరేటర్ నున్నా స్వాతి శ్రీదేవి కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపికలో సామాజిక న్యాయం జరిగిందన్నారు. ఎన్నికైన సభ్యులందరూ సంవత్సరకాలం పాటు పదవిలో ఉంటారన్నారు. ఏలూరు నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేసి పాలకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎన్నికైన సభ్యులకు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే తమకు పదవులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లు నూకపెయ్యి సుధీర్ బాబు,జి శ్రీనివాస్,విప్ పైడి భీమేశ్వరరావు,స్మార్ట్ సిటీ చైర్పర్సన్ బొద్దాని అఖిల, నగర కమిషనర్ డి.చంద్రశేఖర్, కార్యదర్శి ప్రభుదాస్, పలువురు కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.