PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉక్రెయిన్ అధ్య‌క్షుడికి స్టాండింగ్ ఓవేష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆయన ప్రస్తుత పరిస్థితులపై ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడాక ఈయూ పార్లమెంట్ సభ్యులంతా లేచి నిలబడి (స్టాండింగ్ ఒవేషన్) చప్పట్లు కొట్టారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ తాము మాతృభూమి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామన్నారు. తాము ఉక్రెయినీయులమని, శక్తిమంతులమని, తమనెవ్వరూ విడదీయలేరని జెలెన్‌స్కీ చెప్పారు. ఆ వెంటనే సభ్యులంతా లేచి ఆయన్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.

                                 

About Author