NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు – విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీసులు ప్రారంభించండి

1 min read

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసిన టిజి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు: క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యంపై చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని కేంద్ర మంత్రి తెలిపిన‌ట్లు టి.జి భ‌ర‌త్ చెప్పారు. త్వర‌లోనే దీనికి సంబంధించి అడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పార‌న్నారు. క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యం క‌ల్పించేందుకు కేంద్ర మంత్రి ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. ఓర్వక‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌లో ప‌రిశ్రమ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు త‌మ ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. ఇక్కడ అన్ని ర‌కాల ప‌రిశ్రమ‌లు పెట్టేందుకు అనుకూల‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. విమాన స‌ర్వీసు కూడా అందుబాటులోకి వ‌స్తే పారిశ్రామిక‌వేత్తల రాక‌పోక‌ల‌కు సౌక‌ర్యంగా ఉంటుంద‌న్నారు.

About Author