సైక్లింగ్ ర్యాలీ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇంచార్జ్ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, గారు మాట్లాడుతూ కర్నూలు ఏ క్యాప్ అర్బన్ సెంటర్ సైక్లింగ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించినట్లు తెలిపారు.సైక్లింగ్ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు సైక్లింగ్ ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు అనంతరం భారతదేశంలో అత్యధిక మరణాలు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం మరియు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో సహా (NCD) నాన్‌కమ్యూనికేబుల్ వ్యాధులు కూడా నివారించడానికి ప్రతిరోజు వ్యాయామం ద్వారా సైక్లింగ్, నడక,స్విమ్మింగ్ చేయడం ద్వారా మరణాలను నివారించవచ్చని అని తెలియజేశారు.సైక్లింగ్ చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన శారీరక బరువు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరక బరువును నియంత్రించుకోవచ్చు తద్వారా అధికంగా వున్న కేలరీలను ఖర్చుచేయవచ్చు మరియు కండరాల పటుత్వము పెంపొందించడానికి, బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది అని తెలిపారు.ఒత్తిడిని తగ్గించడానికీ తోడ్పడుతుంది, రోజు వారి ఒత్తిడి నుంచి మిమ్మలిని మీరు బయట పడటానికి వ్యాయామం సరైన మార్గం అని తెలియజేశారు.రక్త పోటు నియంత్రణ లో ఉండడానికి దోహద పడుతుంది, తద్వారా భవిష్యుత్తు లో గుండె సంభందిత సమస్యల ప్రమాదమును నియంత్రించడానికి సహాయ పడుతుంది అని తెలియజేశారు.సైక్లింగ్ చేయడం ద్వారా ఏ కారణం చేత నైనా మరణించే ప్రమాదాన్ని 41%తగ్గించవచ్చు అనగా క్యాన్సర్ సంభందిత మరణాలను 45%, మరియు గుండె జబ్బుల ద్వారా సంభవించే మరణాలను 46% అరికట్ట వచ్చు అని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు డి ఐ ఓ, డా.ప్రవీణ్ కుమార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివబాల నగాంజన్, మరియు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నట్లు, ఇంచార్జ్ సూపరింటెండెంట్, డా.సీ.ప్రభాకర రెడ్డి, గారు తెలిపారు.