NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల నందు మన బడి నాడు- నేడు కింద ఫేజ్-2  కింద రూ. 2.05 కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” , ఈ సందర్బంగా ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి”  మాట్లాడుతూ మన జగనన్న పాలనలో విద్యకు పెద్దపీట వేశారని. కావున ప్రతి విద్యార్థిని విద్యార్థి చదువు కోవడానికి ప్రభుత్వ పాఠశాలలను నాడు- నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించి. అక్కడి కంటే ఉన్నతమైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం జరుగుతుంది అన్నారు. ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు పారదర్శకంగా ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా నేరుగా అకౌంట్లోకి జమచేసున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్ కె దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇఓ వెంకటరమణారెడ్డి, ఎంఈఓ 1 ఆంజనేయులు, ఎంఈఓ 2 మధుసూదన్ రావు, ఎంపీపీ కేసన్న, సర్పంచ్ పెద్ద మారెప్ప, హెచ్ఎం గౌసియా బేగం, స్కూల్ ఇంచార్జ్ శ్రీనాథ్ రెడ్డి నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author