గడివేములలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గడివేములలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు నాలుగు రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులపాటు ఆమంచి వేంకటేశ్వర్లుచే శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త మండలిచే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మహేశ్వర రెడ్డి, అర్చకులు చెన్నకేశవయ్య, ప్రధానాచార్యులు యం. రామేశ్వర రావు, కృష్ణమూర్తి, డీలర్ శ్రీనివాసులు, భజన మండలి అధ్యక్షులు బాల వీరాంజనేయులు, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, బోడెమ్మనూరు సుబ్బారెడ్డి, భజన మండలి సభ్యులు ఈడిగ అచ్చెన్న, సుబ్బమ్మ, వీరమ్మ, దేశం సంజీవరెడ్డి, దాసరి ఎల్లయ్య, బాల సంజీవరెడ్డి, వెంకటసాయి , ఈ పూరి లక్ష్మీనారాయణ ,ఎన్ . వెంకటేశ్వర్లుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.