బుల్లితెరపైకి మా అన్నయ్య… 25న ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో సరికొత్త సీరియల్ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ మా అన్నయ్య’, ఈ సీరియల్లో అన్నాచెల్లెళ్ల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. అనూహ్యమైన కథతో రానున్న మా అన్నయ్య’ మార్చి 25న సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు, మీ జీ తెలుగులో ప్రారంభం కానున్నది.మా అన్నయ్య సీరియల్ కథ గంగాధర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ నటుడు గోకుల్ మీనన్ గంగాధర్ పాత్రలోకనిపించనున్నారు.చిన్న వయసు నుంచే తన చెల్లెళ్ల బాగోగులు చూసుకునే బాధ్యతను తీసుకున్న ఒక అన్నయ్య కథే మా అన్నయ్య, ఒక మధ్యతరగతి కుటుంబంలో తోబుట్టువుల మధ్య బంధాన్ని మా అన్నయ్య సీరియల్ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచనాలను మరింతగా పెంచేశాయి. కుటుంబ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల అంచనాలను మించి వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది.ఈ షో గ్రాండ్ లాంచ్ మరియు దాని కథాంశం గురించి జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, జీ తెలుగు ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో మర్కొ విలక్షణమైన కథను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ఆకట్టుకునే కథాంశం, ప్రతిభావంతులైన నటీనటులతో రూపొందుతున్న ఈ కథ మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా, తెలుగు బుల్లితెరపై తొలిసారిగా ఒక కథానాయకుడి కోణం నుంచి చూడబోతున్న మా అన్నయ్య ప్రేక్షకులను తప్పక అలరిస్తుందనే నమ్ముతుమన్నారు.ప్రధాన పాత్ర పోషిస్తున్న గోకుల్ మీనన్ మాట్లాడుతూ.. ‘జి తెలుగులో నేను నటిస్తున్న రెండో సీరియల్ ఇది.ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సీరియల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. భావోద్వేగాలతో కూడిన ఇలాంటి లోతైన పాత్రను పోషించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. ఈ సీరియల్ ప్రారంభం సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ. వెండితెరపైనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకూ వినోదం పంచడంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆకట్టుకునే సీరియల్స్, కార్యక్రమాలతో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు మా పరిధిని విస్తరించేందుకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది. భావోద్వేగభరితమైన కథతో రూపొందుతున్న ‘మా అన్నయ్య’ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు ఉత్సాహంగా ఉన్నాం. వెండితెర మాదిరిగానే బుల్లితెరపైనా ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు.