NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న‌ష్టాల్లో మొద‌లై.. లాభాల్లోకి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మై.. తిరిగి లాభాల్లోకి చేరుకున్నాయి. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా క‌దులుతున్నప్పటికీ.. భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు మాత్రం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ , నిఫ్టీలు లాభాల్లో ముగియ‌గా.. బ్యాంక్ నిఫ్టీ న‌ష్టాల్లో ముగిసింది. యూఎస్ ఆర్థిక వ్యవ‌స్థ, భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ పై యూఎస్ ఫెడ్ ప్రక‌ట‌న కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నట్టు ప‌లువురు నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 175 పాయంట్ల లాభంతో 56,124 వ‌ద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 16,705 వ‌ద్ద, బ్యాంక్ నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప న‌ష్టంతో 35,605 వ‌ద్ద ఉన్నాయి. నిఫ్టీ ఇంట్రాడేలో మ‌రోసారి ఆల్ టైం హైని ట‌చ్ చేసింది.

About Author