NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న‌ష్టాల‌తో మొద‌లై.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్..!

1 min read

ముంబ‌యి: స్టాక్ మార్కెట్ నిన్నటిలాగా న‌ష్టాల‌తో మొద‌లైంది. మొద‌లైన 20 నిమిషాల‌కే లాభాల్లోకి వెళ్లింది. నిన్నటి స‌పోర్ట్ లెవెల్ వ‌ద్ద.. ఈ రోజు కూడ మ‌ద్దతు ల‌భించింది. దీంతో ఆరంభ న‌ష్టాల‌కు బ్రేక్ వేస్తూ.. లాభాల్లో కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో నిఫ్టీ..90 పాయింట్ల లాభంతో ఉంటే.. బ్యాంక్ నిఫ్టీ ..130 పాయింట్ల లాభంతో కొన‌సాగుతోంది. మార్కెట్లో క‌న్సాలిడేష‌న్ ఉండ‌వ‌చ్చు. కోవిడ్ భ‌యంతో ఇన్వెస్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఆర్ బీఐ ద్రవ్యపర‌ప‌తి విధాన స‌మీక్ష ప‌ట్ల కూడ ఒక క‌న్నేసి ఉంచారు. దీంతో మార్కెట్లు క‌న్సాలిడేట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా క‌ద‌లాడుతున్నాయి.

About Author