NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాలతో మొద‌లై.. ఫ్లాట్ గా ముగిసిన సూచీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మై చివ‌రి గంట‌లో అమ్మ‌కాల ఒత్తిడి కార‌ణంగా న‌ష్టాల‌తో ముగిశాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త అమ్మ‌కాల‌కు దారితీసింది. మ‌రోవైపు అంత‌ర్జాతీయంగా ర‌ష్యా పై వివిధ దేశాలు ఆంక్ష‌ల‌కు దిగాయి. దీంతో రేప‌టి క‌ల్లా ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయోన‌న్న భ‌యంతో ఇన్వెస్ట‌ర్లు చివ‌రి గంట‌లో అమ్మ‌కాలకు దిగారు. దీంతో ఆరంభ లాభాలు ఆవిర‌య్యాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 68 పాయింట్ల న‌ష్టంతో 57232 వ‌ద్ద‌, నిఫ్టీ 28 పాయింట్ల న‌ష్టంతో 17063 వ‌ద్ద ముగిసింది.

                                       

About Author