అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు స్టేట్ బెస్ట్ అవార్డ్స్
1 min read
విజయవాడ , న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన రాష్ట్రంలోని ఐదు మంది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు స్టేట్ బెస్ట్ అవార్డ్స్ ను మరియు వారికి సన్మానం చేయడం జరిగినది, అందులో కర్నూలు జిల్లా నుంచి శ్రీ బి.మద్దిలేటి, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, కర్నూలు వారికి రాష్ట్ర ఉత్తమ పురస్కారం ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు హానరబుల్ శ్రీ డోల బాల వీరాంజనేయులు చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ అవార్డును అందుకోవడం జరిగినది. అదేవిధంగా కర్నూలు ఏ. ఎస్. డబ్ల్యూ. ఓ పరిధిలో ఓర్వకల్లు ప్రభుత్వ బాలికల వసతి గృహం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 100% సాధించినందుకు గాను అక్కడి వసతి గృహ సంరక్షణ అధికారి శ్రీమతి కె. ప్రమీల రాణి వారికి కూడా సాంఘిక శాఖ మంత్రివర్యులు శ్రీ డోలబాల వీరాంజనేయులు గారి చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవార్డును అందుకోవడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అలాగే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి లావణ్య మరియు ఇతర అధికారులు పాల్గొని ఆ యొక్క పురస్కారాలు అందివ్వడం జరిగినది.