PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర  కేంద్ర ప్రభుత్వాలను గద్దె దించాలి

1 min read

రాష్ట్రాన్నిదేశాన్ని రక్షించుకోవాలి… పి రామచంద్రయ్య

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వ్యవసాయంగాన్ని పరిశ్రమలను కార్పొరేట్ రంగానికి దారాధత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా వారి విధానాలకు మద్దతిస్తున్న  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను గద్దె దించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రాజా సాహెబ్ లు   పిలుపునిచ్చారు. శుక్రవారం రోజు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె పత్తికొండలో స్థానిక గెస్ట్ హౌస్ నుండి నాలుగు స్తంభాల వరకు రైతులు కార్మికులతో గ్రామీణ బంధును విజయవంతంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడని, కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ దేశానికి తీరని నష్టం కలిగిస్తున్నాడని వారు విమర్శించారు. ఇంకొక వైపు తమ పంటలకు చట్టబద్ధమైన కనీసం మద్దతు ధరను ప్రకటించాలని, విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని, 60 సంవత్సరాల పైబడిన వ్యవసాయ కూలీలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రైతాంగం మీద మోడీ ఉక్కు పాదం మోపుతూ, నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రస్తుతము రైతాంగం డిమాండ్ చేస్తూ ఆందోళనకు పూనుకున్నదని అన్నారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పింది మోడీనే, పంట మీద అయ్యే పెట్టుబడికి మించి 50 శాతం లాభంతో మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పింది కూడా మోడీనే అని అన్నారు. అయితే ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పినట్టే ఈ వాగ్దానాన్ని కూడా మోడీ తుంగలో తొక్కాడని, రైతు వ్యతిరేకి కార్మిక వ్యతిరేకి అయిన మోడీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని వారు కోరారు.తక్షణం పోలవరం పూర్తి చేయాలని, గాలేరు నగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి అనుసంధానంగా ఉన్న చెరువులకు నీరు నింపాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలు 90% రాయితీపై అందించాలన్నారు. రైతు పండించిన పంటలకు ప్రభుత్వమే తన పర్యవేక్షణలో గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ వ్యవసాయ ఉద్యాన పంటలకు అనుసంధానం చేయాలని కోరారు. ప్రతి రైతు కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఇది వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి రైతుకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సదుపాయం కల్పించాలని, ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ కు డ్రిప్ ఇస్తున్న రాయితీ తోపాటు జీఎస్టీ ని  ప్రభుత్వం భరించాల అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నబి రసూల్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం   అధ్యక్షులు ఎం కారన్న, కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఉమాపతి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఎఐటియుసి నియోజవర్గ అధ్యక్షులు నెట్టే కంటయ్య, తాలూకా నాయకులు  గుండు బాషా, మాదన్న, రాజప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర, గురుదాస్, సుల్తాన్, నాగరాజు, ఏ ఐ వై ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శి పెద్దయ్య, అన్వేష్, చిరంజీవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

About Author