రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లతో సమీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024 తయారీ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.మంగళవారం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటర్ల జాబితా పునః పరిశీలన, 6,7,8 ఫామ్ ల స్వీకరణ, ఇంటింటి సర్వే, డూప్లికేట్, షిఫ్టెడ్, డెత్ ఎలెక్టోరల్స్, జంక్ క్యారెక్టర్, 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న హౌసెస్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, మొదటి, రెండవ, మూడవ దశ లో ఎపిక్ కార్డ్స్ జనరేషన్, ప్రిటింగ్, పంపిణీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మాట్లాడుతూ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశాల్లో లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా పరిశీలించి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 16వ తేదిన నిర్వహిస్తున్న ఎఫెల్షి (FLC) వర్క్ షాప్ కు జిల్లా కలెక్టర్లతో పాటు ఒక సీనియర్ సూపర్వైజరీ అధికారి హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లాలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో తొలగించబడిన ఓటర్ల కు సంబంధించి పూర్తి స్థాయిలో పున:పరిశీలించడం జరిగిందన్నారు.. రాజకీయ పార్టీ ప్రతినిధుల నుండి వచ్చిన 57,370 ఫిర్యాదులను కూడా పరిష్కరించడం జరిగిందన్నారు. ఫార్మ్-6కు సంబంధించి 65,846, ఫార్మ్-7కు సంబంధించి 46,912, ఫార్మ్-8 కు సంబంధించి 54,561 వచ్చాయని, వాటిని ఎంక్వైరీ చేయడం జరిగిందన్నారు.. రెండు రోజులలోపు వీటిని ఆన్లైన్ లో అప్డేట్ చేయడం జరిగిందన్నారు.. పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ కు సంబంధించి ఏఈఆర్ఓలు పరిశీలించడం జరిగిందన్నారు. ఒకే ఇంట్లో పది మంది కంటే ఎక్కువగా ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించి అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. అనమొలీస్ కు సంబంధించి 176 జంక్ క్యారెక్టర్స్ ఎంక్వైరీ చేయడం జరిగిందని, అదే విధంగా మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నుండి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, డిఆర్ఓ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లిఖార్జునుడు, రమ, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, ఎన్నికల సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.