పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
1 min read
రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి పనులు పరిశీలన
స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు,జిల్లా కలెక్టర్,డి ఐ జి,ఎస్ పి,జెసి, ఉన్నతాధికారులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గురువారం పోలవరం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 12.10 ని. లకు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రికి కి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్,రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారధి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, డా. కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, ఏలూరు రేంజి ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపీ ఏఎస్ సిపిసి చైర్మన్ పీతల సుజాత, ప్రభృతులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
