NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

15న కర్నూలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక..

1 min read

ముఖ్యమంత్రి  పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15న కర్నూలుకు రానున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , ఎమ్మిగనూరు శాసనసభ్యులు మరియు కర్నూలు మున్సిపల్ కమిషనర్.శుక్రవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన , ఎస్పీ కృష్ణ కాంత్ , ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్న కేశవరెడ్డి , కర్నూల్ మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ  బళ్ళారి రోడ్డులోని కింగ్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ ప్రాంగణాన్ని  మరియు పరిసరాలను ముఖ్యమంత్రి రాక సందర్భంగా పర్యవేక్షించారు.ఫిబ్రవరి నెల 15వ తారీఖున ఎమ్మిగనూరు శాసనసభ్యుల మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహమునకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు అవుతున్నందున , ఆ పర్యటన కు చేయవలసిన ఏర్పాట్లను  పరిశీలించారు.ఈ పర్యటనకు ఎమ్మిగనూరు శాసనసభ్యుల కుమారుడు జగన్మోహన్ రెడ్డి ,రోడ్లు భవనాల శాఖ , కర్నూలు ఆర్ డి ఓ, విద్యుత్ ,ఆరోగ్య శాఖ , సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author