PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ఎస్పీని అభినందించిన రాష్ట్ర బాలల హక్కుల సభ్యులు

1 min read

– చొరవతో 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి..

– యాసిడ్ దాడి ముద్దాయిలు అరెస్ట్..

– ఎస్పీని అభినందించిన

– రాష్ట్ర బాలల హక్కుల సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ప్రాధాన్యత కలిగివున్న ఏలూరు యాసిడ్ ఎటాక్ కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు సెక్షను కోర్టు లో విధించుట జరిగిందని అందు కొరకు మహిళా అధికారిణి  డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్  ప్రత్యేక పర్యవేక్షణ చేసి దిశా చట్టంను స్ఫూర్తిగా తీసుకొని సదరు కేసులో ముద్దాయి లను వెనివంటనే అరెస్టు అరెస్టు చేసి చట్టానికి అప్పగించారు. సదరు  కేసులో 21 రోజులలో దర్యాప్తు ను పూర్తి చేసి, జిల్లా ఎస్పీ  తనదైన కోణంలో స్ఫూర్తిని  ప్రదర్శించి స్పీడ్ ట్రయల్  ద్వారా 117 రోజులలో  ముద్దాయిలకు శిక్ష పడే విధముగా పర్యవేక్షణ చేసిన జిల్లా ఎస్పీ ని మాజీ  ఏలూరు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ సభ్యులు మేతర అజయ్ బాబు, కాశీ కృష్ణ మరియు ఎస్సీ ఎస్టీ, బాలల హక్కుల రాష్ట్ర సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్ గురువారంఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో జిల్లా ఎస్పీ ని కలిసి ఒక మహిళపై జరిగిన అఘాయిత్యానికి ఎంతో శ్రమతో ముద్దాయిలకు శిక్ష విధించుట కొరకు శ్రమించిన జిల్లా ఎస్పీ కి పుష్పగుచ్చం అందించి  అభినందించినారు.

About Author