NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల‌న్ మ‌స్క్ కోసం రాష్ట్రాల పోటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెస్లా అధినేత ఎల‌న్ మ‌స్క్ ను భార‌త్ లోని రాష్ట్రాల మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ రాష్ట్రానికి ర‌మ్మంటే.. త‌మ రాష్ట్రానికి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తున్నాయి. పంజాబ్, తెలంగాణ‌, ప‌శ్చిమ‌బెంగాల్, మ‌హారాష్ట్ర‌లు తమ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరుతున్నాయి. ఇండియాలో ఎల్ట్రక్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఇటీవల ఓ ట్విట్టర్ యూజర్ మస్క్‌ను కోరాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. తనకూ రావాలనే ఉందని కానీ, భారత ప్రభుత్వం నుంచి చాలా కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు.కేంద్ర ప్రభుత్వం నుంచి టెస్లాకు అడ్డంకులు ఎదురవడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగిపోయాయి. తమ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమ నెలకొల్పాలంటూ పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మస్క్‌ను ఆహ్వానిస్తున్నాయి.

                                              

About Author