NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: 5 6 తేదీలలో నెల్లూరులోని వేంకటేశ్వరా కస్తూరిబా కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు సి. శ్రావణ్ కుమార్ తెలిపారు ఒంగోలులోని సంఘ జిల్లా కార్యాలయంలో వాల్పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యా వ్యవస్థ లో ఉన్నటువంటి అనేక సమస్యలను ఈ సభలలో చర్చి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం వాటి అమలు లో చేయాల్సిన మార్పులు చేర్పులు చర్చిస్తామని తెలిపారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న తీరుపై కొంత విధానం వేరుగా ఉందని దానిని సవరించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారితో పాటు కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ గారిని, రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని, కమిషనర్ శ్రీ సురేష్ కుమార్ గారిని, ఇతర అధికారులను, పెద్దలను ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే మల్లికార్జునరావు, టి.దిలీప్ చక్రవర్తి, జిల్లా బాధ్యులు కే.యస్.యన్. కుమార్, కె.వి. శేషారావు,నాగకుమర శర్మ, వి.చంద్రశేఖర్, గుణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author