రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం
1 min read
మంత్రాలయ, న్యూస్ నేడు: రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం అవుతుందని టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ బారిక ఉరుకుందు అన్నారు. ఆదివారం మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని మాధవరం గ్రామంలో సూపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సూపరిపాలన తొలిఅడుగు కరపత్రాలు ప్రజల కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది లోనే ప్రజల కు సూపరిపాలన అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. అందులో ఇది కేవలం రాజకీయ ప్రచారంగా కాకుండా ప్రజలతో ప్రత్యక్షంగా అనుసంధానం సాధించే అవకాశంగా మారిందని తెలిపారు. ప్రజల స్పందన చూస్తే ఆశాజనకంగా ఉందని అన్నారు. సంక్షేమ పథకాల విషయానికొస్తే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇంటింటికీ చేరుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.