PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంబేపల్లి హైస్కూల్లో స్టేట్ ఎడ్యుకేషనల్ ఎచీవ్ మెంట్ సర్వే

1 min read

– ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి వెల్లడి.

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్టేట్ ఎడ్యుకేషనల్ ఎచీవ్ మెంట్ సర్వే-2023 ప్రకారం విద్యార్థులలో ఉన్న అభ్యసన సామర్ధ్యాలను అంచనా వేసేందుకు శుక్రవారం ఉదయం పాఠశాలలో పరీక్షలు నిర్వహించామని ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహరెడ్డి తెలిపారు. ఈ సర్వే పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, గణితం పరిజ్ఞానంపై ఓఎంఆర్ షీట్స్ ద్వారా పాఠశాలలోని 3,6,9 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో  నిర్వహించామన్నారు. ఈ  పరీక్షల ఫలితాల ద్వారా  విద్యార్థుల విద్యాసామర్ధ్యాలు, అభ్యసన అంతరాలను గుర్తించడం జరుగుతుందన్నారు. దీనివలన బోధన అభ్యసనాల్లో లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, నాగ అంబరీష్, శివకుమార్ లు పాల్గొన్నారు.

About Author