రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జులై 18న ఎన్నిక జరగనుంది. జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు జులై రెండు చివరి తేదీ. ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి సహా… అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎలక్టరోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10,98,903 కాగా 5,34,680 ఓట్లు పొందిన అభ్యర్ధి రాష్ట్రపతిగా ఎన్నికౌతారు. ఎలక్టోరల్ కాలేజీలో 778 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలుంటారు. ఒక్కో ఎంపీ విలువ 700. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు ఒక్కరికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.