PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా  తడాఖాను రాష్ట్ర ప్రభుత్వానికి రుచి చూపిస్తాం..

1 min read

కేంద్రం నిధులు 988 కోట్లు రూ. రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోంది  

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  తాజాగా దొంగిలించిన 600 కోట్ల రూపాయలు 4రోజులలో మా* గ్రామ పంచాయతీల మండల పరిషత్తుల,జిల్లా పరిషత్ ల ఖాతాల్లో జమ చేయాలనీ లేనిపక్షంలో రాజకీయాలకతీతంగా సర్పంచులు,ఎంపీటీసీలు  జడ్పిటిసి లతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి మా  తడాఖాను రాష్ట్ర ప్రభుత్వానికి రుచి చూపిస్తామని హెచ్చరిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12, 918 గ్రామాల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా 2022=23వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండవ విడత నిధులు 988 కోట్ల రూపాయలను తాజాగా 4 రోజుల క్రితం సర్పంచులకు, ఎంపిటిసి లకు ,జడ్పిటిసి లకు, ఎంపీపీ లకు ,జిల్లా పరిషత్ చైర్మన్ లకు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి  పంపించినట్లు మాకు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం తెలిసినది.కానీ కేంద్రం పంపిన 988 కోట్ల రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు PROCEEDINGS NO…2095678/CPR & RD/H1 20023 ద్వారా మా గ్రామ పంచాయతీ PFMS ఖాతాల్లో జమ చేసినది.కానీ  మిగిలిన 600 కోట్ల రూపాయలను మా పంచాయతీలకు ఇవ్వకుండా దొంగిలించి  దారి మళ్లించి వేసినది .రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణాన్ని  మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తోంది.గతంలో కూడా ఐదే విధంగా 8629 కొట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ 8629కోట్ల రూపాయాలు తిరిగి మా గ్రామ పంచాయతీ లకు ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ నిధులు ఇవ్వక పోగా తాజాగా 600కొట్లు దొంగిలించడం దారుణం.తాజాగా మరియు పాత దొంగిలించిన నిధులు జమ చేసేంతవరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో  పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని  హెచ్చరిస్తున్నాము.

About Author