మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
1 min readమూడవ విడత వైయస్సార్ ఆసరా పథకం అమలు
పండుగ వాతావరణంలా వైయస్సార్ ఆసరా పథకం
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసిన పొదుపు సంఘాల మహిళలు మరియు మంత్రివర్యులు
జోహాపురం నుండి ఆస్పరి మండలం కు ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం గారు
పల్లెవెలుగు వెబ్ ఆలూరు, మార్చి : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు పేర్కొన్నారు. మంగళవారం ఆస్పరి మండల కేంద్రం గ్రామ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన మూడవ విడత వైయస్సార్ ఆసరా పథకం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులకి బాణసంచా, పూలమాలలు, తపెట్ల్లు, శవాలతో గ్రామ ప్రజలు, మహిళలు, అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదటగా మంత్రివర్యులు మహిళా సంఘాలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఈ సందర్భంగా మాట్లాడుతూ…మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అక్క చెల్లెమ్మలకు అభివృద్ధి గాను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2లక్షల 25 వేల 33 వేల 763 కోట్ల నగదు జమ చేసిందన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా 25 వేల 659 స్వయం సహాయక సంఘాలలో 425 కోట్లు జమ చేశామన్నారు. అలాగే ఆలూరు నియోజకవర్గం 6 మండలాల్లో 2,708 స్వయం సహాయక పొదుపు సంఘాలకు 1,292.01 కోట్లు దాదాపుగా 13 కోట్ల మేర అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. ఆ నగదు ద్వారా మహిళలు చిన్న వ్యాపారం లేదా గేద, మేకలు పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఆదాయం పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులు మహిళా పొదుపు సంఘాలకు సూచించారు. మహిళ జీవనోపాధి పెంచుకునే విధంగా కార్యచరణం పొదుపు సంఘాలకు సూచించారు.అనంతరం మంత్రివర్యులు గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని మంత్రివర్యులు దృష్టికి తీసుకుని రాగా సానుకూలంగా స్పందించి జోహాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా ఆస్పరి మండలంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. త్వరలో త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమానికి డి.అర్.డి.ఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ , తాసిల్దార్ కుమారస్వామి, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్పిటిసి దొరబాబు, ఎంపీపీ సుంకర ఉమా దేవి, సర్పంచ్ యం. రాధమ్మ, మండల సమైక్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.