దళిత సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి
1 min read– రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న హత్యలు దాడులు అరికట్టాలి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నందు ఎమ్మార్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో పట్టణం వీధుల గుండా ర్యాలీ చేపట్టి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తాసిల్దార్ ఆఫీస్ ఎదురుకుండా ధర్నా చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఎం ఆర్ పి ఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగపాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిగలపై నిత్యం దాడులు దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు, భూ కుంభ కోణాలు పెరిగి పోయాయన్నారు.ఈ దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టి దాడులకు గురైన దళితులకు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం అందించి, దళితులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.మాదిగలకు విద్య, వైద్యం, ఉద్యోగ ఆర్థిక, రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం జరిగేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.రద్దు పరిచిన 28 దళిత సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, వెనకబడిన కులాల వారి అభివృద్ధికి తోడ్పాటు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో భూమిలేని మాదిగ మాదిగ ఉపకులాలకు ఐదు ఎకరాలు చొప్పున వ్యవసాయ భూమి కేటాయించి, బోర్లు వేయించి వ్యవసాయ రైతులుగా మాదిగ మాదిగ ఉపకులాల వారిని గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ గారికి డిమాండ్లతో కూడినవినతిపత్రంసమర్పించారు.ఈకార్యక్రమలోవెల్దుర్తి మండలం అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ,కర్నూల్ నంద్యాల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మాదాపురం గిడ్డయ్య మాదిగ,కర్నూలు జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ,నంద్యాల జిల్లాఅధ్యక్షుడుఆర్శ్రీనివాసులుమాదిగ,బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్,డోన్ నియోజకవర్గం అధ్యక్షుడు సత్యం మాదిగ,బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగిరి మాదిగ,డోన్ మండల అధ్యక్షుడు ఆవులదొడ్డి ప్రసాద్మాదిగ,దేవనకొండ మండలం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాదిగ, దేవనకొండ మండలం కార్యదర్శులు హరి మాదిగ మల్లికార్జున మాదిగ,క్రిష్ణగిరి మండలం కార్యదర్శి మద్దిలేటి మాదిగ,వెల్దుర్తి మండలం సెక్రెటరీ వెంకటేష్ మాదిగ,కలుగొట్ల గ్రామం నడిపి మద్దిలేటి మాదిగ, వెల్దుర్తి మండలం ప్రధాన కార్యదర్శి మద్దిలేటి మాదిగతదితరులు పాల్గొన్నారు.