PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తుంది

1 min read

– వై.నాగేశ్వరరావు యాదవ్తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : శుక్రవారం డోన్ లో ఎమ్మెల్సీ అభ్యర్థికి ప్రపోజల్,సపోర్ట్ చేసిన ఎంపీటీసీల అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ గారు,డోన్ నియోజకవర్గం ఇన్చార్జి సుబ్బారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ గారు, డోన్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు, బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ గారు, యువ నాయకులు గౌతమ్ రెడ్డి గారు, బేతంచర్ల టిడిపి నాయకులు శేక్షావలిచౌదరి గారు, తెలుగు యువత అధ్యక్షులు కోదండరాం గారు, తెలుగు యువత నాయకులు సుధాకర్ గారు, ప్యాపిలి మండలం అధ్యక్షులు రామసుబ్బయ్య గారు,అబ్బిరెడ్డి పల్లె గోవిందు గారు,కనుమకుంట్ల గోవిందు గారు, పెద్దపుచర్ల ప్రసాద్ రెడ్డి గారు,కాజాఫిరా గారు, చల్లా అనుదీప్ గారు,దారుశీను గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ:
ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎటువైపు పోతుంది ఎన్నికలు కూడా ఏకపక్షం గా జరపాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పని చేస్తుంది.గ్రాడ్యుయేషన్ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ప్రశాంతంగా జరగాలి. ఎమ్మెల్సీ నామినేషన్లకు నిన్న లాస్ట్ డేట్. ఈ వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రపాన్ని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయకుండా ఇలాంటి పోటీ లేకుండా గెలవాలని దురుద్దేశంతో చాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ యూనియన్ వాళ్ళు పోటీ చేస్తా ప్రజాస్వామ్యబద్ధంగా వారి యొక్క ఫండ్స్ ను ఈ ప్రభుత్వం ఇవ్వకపోగా, ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కచ్చితంగా ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ఉండి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేమంతా వారికి సపోర్ట్ చేస్తూ అండగా మా కౌన్సిలర్లు ఎంపిటిసి మెంబర్లు సపోర్ట్ చేయడానికి వెళ్లడం జరిగినది సంతకాలు కూడా డోన్ లో ఉన్న లోకల్ అభ్యర్థి శ్రీనివాసులు గారు వారితో పాటు,ఇంకా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం జరిగినది కానీ ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు ఇక్కడ ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా ఇష్టపడని పరిస్థితులలో అతని నామినేషన్ ను ఎలాగైనా విత్ డ్రా చేపించాలనే దురుద్దేశంతో ఎవరైతే వాళ్లకు సపోర్ట్ చేసిన కౌన్సిలర్లను దొంగల వలె ఎత్తుకొని పోయి వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, నాన్న విధంగా హింసించి వాళ్లతో ఈ సంతకాలు మావి కాదు అని చెప్పించి ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ చెల్లకుండా,విత్ డ్రా చేపించాలనే కుట్రపన్నారు. ఈ కుట్రలో భాగమైన అధికారుల పైన లీగల్ గా యాక్షన్ తీసుకోని వారిని శిక్షించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం.

About Author