రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చేందుకు రూ. 6300 కోట్లు ఖర్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలోని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కమలనాథులు రూ.6300 కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఈ ఖర్చేకనుక లేకపోతే ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ‘పెట్రోలు, డీజిల్‌పై జీఎస్టీ విధించి సామాన్యుల ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ వినియోగిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. పాలు, వెన్న, బియ్యం వంటివాటిపై విధిస్తున్న జీఎస్టీ ద్వారా కేంద్రానికి 7500 కోట్ల రూపాయలు సమకూరుతున్నాయని, వీటి నుంచి ప్రభుత్వాలను కూల్చేందుకు ఇప్పటి వరకు రూ.6300 కోట్లను వెచ్చించారని, అలా చేయకుండా ఉంటే.. అసలు జీఎస్టీ విధించాల్సిన అవసరమే ఉండదని వ్యాఖ్యానించారు.