PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

1న మిడుతూరులో రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు

1 min read

– బహుమతి రాని ప్రతి కాడికి 2 వేలు -గుర్రం పందాలు నిర్వహణ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ మద్వి రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా గ్రామంలో రాష్ట్రస్థాయి 6 పండ్ల వృషభ రాజుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కాత రాజశేఖర రెడ్డి తెలిపారు. ఈనెల 1వ తేదీ ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని పోటీల్లో పాల్గొనదలచిన వారు 500 రూపాయలు ప్రవేశము చెల్లించి పోటీలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు.మొత్తం ఆరు బహుమతులు ఉన్నాయని మొదటి బహుమతిగా 40 వేలు,రెండవ బహుమతి 30వేలు,3వ బహుమతి 20వేలు,4వ బహుమతి 15వేలు,5వ బహుమతి 10వేలు,6వ బహుమతి 6వేలు ఉన్నాయని బహుమతి రాని ప్రతి కాడికి 2 వేల రూపాయలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈపోటీలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మండ్ర శివానందరెడ్డి మరియు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి హాజరు అవుతున్నారని తెలిపారు.మరిన్ని వివరాలకు- ఖాతా రాజశేఖర్ రెడ్డి-8500021544,బన్నూరు శ్రీనివాసరెడ్డి-7386726463, ఖాతా హరి సర్వోత్తమ్ రెడ్డి, యరభం ప్రమోద్ రెడ్డి లను సంప్రదించవచ్చు.గుర్రం పందాలు నిర్వహణ* పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన బ్రహ్మోత్సవాల సందర్భంగా గుర్రం పందాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బన్నూరు సర్వోత్తమ రెడ్డి తెలిపారు.మే 1వ తేదీన ఉదయం గుర్రం పందాలు నిర్వహిస్తున్నట్లు పోటీలో పాల్గొనదలచిన వారు 200 రూ.లు ప్రవేశ రుసుం చెల్లించాలని అన్నారు. మరిన్ని వివరాలకు బన్నూరు సర్వోత్తమ రెడ్డి-9177084104,గుర్రం బండి మూర్తి జావలి-9908955988,బన్నూరు రామకృష్ణారెడ్డి లను సంప్రదించవచ్చు.

About Author