రేపు’ఉప్పల దడియ’లో రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు..
1 min read
పోటీలను ప్రారంభించనున్న మాండ్ర,ఎమ్మెల్యే,గౌరు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పల దడియ గ్రామంలో రేపు శనివారం 5వ తేదీ ఉ.8 గంటలకు రాష్ట్ర స్థాయి 6 పళ్ళ ఎద్దుల బండలాగుడు పోటీలు గ్రామ రైతు సంఘం వారి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ టీడీపీ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఉగాది,రంజాన్,శ్రీరామ నవమి,గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి హాజరవుతున్నారని అన్నారు.ఈ బహుమతులు మొదటి నుండి 8 బహుమతులు అనగా 40 వేల నుండి 5 వేల వరకు ఉన్నాయన్నారు.పోటీలో పాల్గొనదలచిన జట్లు 600 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని అదేవిధంగా మరిన్ని వివరాలకు:9959435354..9866416512 నంబర్లకు సంప్రదించవచ్చు.