25 న విజయవాడలో రాష్ట్రస్థాయి మహా ధర్నా
1 min read– జగన్నన్న గోరుముద్ద పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– సెప్టెంబర్ 25న రాష్ట్ర స్థాయి మహా ధర్నా జయప్రదం చేయాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ బాబు పిలుపు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రవ్యాప్తంగా జగనన్న గోరు ముద్ద పథకంలో పనిచేస్తున్న 86,500 మంది పేద మహిళా కార్మికులు మూడువేల వేతనంతో జీవనం కొనసాగించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు వీరికి వేతనాలు పెంచి, జగనన్న మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ సెప్టెంబర్ 25 న విజయవాడలో రాష్ట్రస్థాయి మహా ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నా కార్యక్రమం లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ బాబు పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక హై స్కూల్ లో కార్మికుల తో కలిసి కరపత్రాలు విడుదల చేశారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన వైసీపీ ప్రభుత్వం మహిళా కార్మికులకు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదని గత నాలుగు సంవత్సరాల నుండి మూడు వేల రూపాయల వేతనంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల కుటుంబం ఎలా జీవనం కొనసాగిస్తారని వారు ప్రశ్నించారు.కష్టపడి పనిచేసే మిడ్ డే మిల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచకుండా విస్మరిస్తుందని అడగని వారికి సహాయం చేస్తుందఅన్నారు.గత ప్రభుత్వం లో 2019లో పెంచిన వేతనాల జిఓ ను అమలు చేస్తుందన్నారు.రోజుకు 8 గంటల పాటు పనిచేస్తు ప్రభుత్వ పథకాన్ని కొనసాగిస్తున్న వీరి శ్రమను రాజకీయ ప్రచారాలకు ఉపయోగిస్తుందన్నారు. తనపేరు మీద జగనన్న గోరుముద్ద అని పెట్టుకొని నూతన మెను అమలు చేయాలని చెప్పిన సీఎం మెస్ చార్జీలు ఎందుకు పెంచడం లేదని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగాయని ఎనిమిది రూపాయలకు ఒక పూట భోజనం ఎలా సాధ్యం ఆవుదుతుందని, ఎమ్మెల్యేల పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివితే జగనన్న గోరుముద్ద పథకం ఎలా అమలు అవుతుందో తెలుస్తుంది అన్నారు. కార్మికుల కష్టంతో ఈ పథకం నడుస్తుందన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి అనేక పోరాటాలు మహిళా కార్మికులు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని పేద విద్యార్థుల పై ప్రభుత్వం కనికరించాలని,కార్మికుల వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలన్నారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు.సెప్టెంబర్ 25న ధర్నా చౌక్ లో జరిగే శాంతియుత “మహాధర్నా” లో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.. ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకురాలు జయమ్మ, ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.