రాష్ట్ర స్థాయి ఏక పాత్ర, పాటల పోటీలు
1 min read– టిడిపి కల్చరల్ అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఏక పాత్రాభినయ, పాటల పోటీలు వచ్చే నెల 2, 3వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టిడిపి కల్చరల్ అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో హనుమాన్ కళా సమితి సహకారంతో ఫిబ్రవరి 2 తారీకు మరియు 3తారీకున రెండు రోజులపాటు ఏకపాత్ర అభినయ పద్య మరియు గద్య ( డైలాగులు) రెండు విభాగాలలో పోటీ మరియు పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. కర్నూల్ నగరంలోని మద్దూర్ నగర్ మున్సిపల్ కాంప్లెక్స్ వెనక మహాకవి పింగళి సూరన తెలుగు తోట నందు పోటీలు జరుగుతాయని తెలిపారు. పాల్గొనే ఆసక్తి కలిగిన వారు ఒక పాత్రకు రూ. 200 ఫీజు ఒకటవ తారీఖులోగా నమోదు చేసుకోవాలని కోరారు. ఎంట్రీ ఫీజు ఫోన్ పే ద్వారా గాని లేదా నేరుగా,చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు. పద్య, గద్యములకు పది నిమిషంలో నుండి 15 నిమిషములు సమయం ఉంటుందని, కళాకారులకు రెండు రోజులు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. ప్రదర్శనకు అవసరమైన సాధారణ స్టేజి, మైకు సౌకర్యాలు ఉంటాయని.. అయితే మేకప్ సంగీతము సొంత ఖర్చులతో సమకూర్చుకొనవలెను. పోటీలో పాల్గొనే ప్రతి కళాకారునికి ప్రశంసా పత్రము, బహుమతి పొందిన వారికి, నగదు బహుమతి ,మోమెంటు, ఇస్తామన్నారు. తుది నిర్ణయము న్యాయ నిర్ణయితలదేనన్నారు. పద్య విభాగానికి ప్రథమ బహుమతి రూ. 3000 రెండవ బహుమతి రూ.2000, మూడవ బహుమతి రూ.1000 తోపాటు కన్సలేషన్ బహుమతి రూ.500 ఇవ్వబడతాయి అని వివరించారు. ఏకపాత్ర డైలాగు విభాగానికి ప్రథమ బహుమతి రూ.3000 , రెండవ బహుమతి రూ.2000, మూడవ బహుమతి రూ.1000, కన్సలేషన్ రూ.500 ఇస్తామని చెప్పారు. అలాగే పాటల పోటీలకు ఎంట్రీ ఫీజు రూ. 50 చెల్లించాలి. ఈ విభాగంలో ప్రధమ బహుమతి రూ. 500, ద్వితీయ రూ.300 , తృతీయ బహుమతి రూ. 100 ఇవ్వ బడతాయని తెలిపారు.రెండు రోజుల ప్రోగ్రాంలో మూడవ తేదీన బహుమతి ప్రధానం జరుగుతుందని హనుమంతరావు చౌదరి వివరించారు. పూర్తి వివరాలకు హనుమాన్ కళా సమితి అధ్యక్షుడు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సంస్కృతి కవిభాగం అధ్యక్షులు ఫోన్ నెంబర్ 9393826402 కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు. నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించడు కార్యక్రమంలో కళాకారులు, కళాభిమానులు పోటీలలో పాల్గొనవలసిందిగా హనుమంతరావు చౌదరి కోరారు.