16, 17 వ తేదీలలో రాష్ట్రస్థాయి వర్క్ షాప్…
1 min read
బికెయంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికెయంయు) రాష్ట్రస్థాయి వర్క్ షాపు మార్చి 16, 17 తేదీలలో గుంటూరులో జరుగుతుందని బికేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఎంపికైన వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తలు ఈనెల16వ తేదీ ఉదయం 10:30 గంటలకు గుంటూరు కొత్తపేటలో ఉన్న సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవనమునకు చేరుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ వర్క్ షాప్ లో ఉపాధి హామీ చట్టంపై, గ్రామీణ కష్టజీవులు-సంక్షేమం-అభివృద్ధి పైన మేధావులు పాల్గొని కార్యకర్తలకు బోధిస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామీణ పేదల సమస్యలపై ఇంకా అనేక అంశాలపై వర్క్ షాప్ లో చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుండి ఎంపికైన వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.