ఆక్రమణలపై జిల్లా పంచాయతీ అధికారిని నివేదిక కోరిన రాష్ట్ర లోకాయుక్త
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండిగుంట గ్రామశివారు, ఆనందపురం దళితవాడను ఆనుకొనియున్న జలవనరులశాఖకు చెందిన 26 సెంట్ల భూమిలో ఆక్రమణలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి. నాగేశ్వర నాయక్ నివేదిక కోరుతూ ఉత్తర్వులు జారీచేశారని, కృష్ణాజిల్లా, ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఒక ప్రకటన లో తెలియజేశారు.2023 సంవత్సరం సెప్టెంబర్ 28 తేదీన రాష్ట్ర లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు మేరకు పై ఉత్తర్వులు జారీచేశారు.దళితవాడను ఆనుకొని రీ. సర్వే. నెం. 926లోని 23 సెంట్ల జలవనరులశాఖకు చెందిన భూమిని సమగ్ర సర్వే చేయటానికి లోకాయుక్తఆదేశాల మేరకు గుడివాడ డి.ఎల్.పి.ఓ. జి.సంపత్ కుమారిని, గండిగుంట పంచాయతీ కార్యదర్శిని విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి, ఎస్. వి. నాగేశ్వర నాయక్, 2023 నవంబర్ 30వ తేదీన, ఉత్తర్వులు జారీచేశారు. రీ. సర్వే. నెం. 926లోని 20 సెంట్ల భూమిని ఆక్రమించిన చిన ఓగిరాల రైతులు సాగు చేసుకోవటమే, కాకుండా లక్షలాది రూపాయలు క్రయవిక్రయాలు జరుపుచున్నందున, 26 సెంట్ల భూమిని సర్వే చేసి, గండిగుంట గ్రామపంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకోటానికి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేయటం జరిగింది.కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిఉత్తర్వులు జారీ చేశారని, జంపాన శ్రీనివాసగౌడ్ మాజీ సర్పంచ్, గురజాడ సామాజిక కార్యకర్త, ఒక ప్రకటనలో తెలియజేశారు.