PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రానికి మళ్ళీ సీఎం జగన్ మోహన్ రెడ్డినే కావాలి..

1 min read

సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందునే రాష్ట్రానికి జగన్ అవసరమని అన్ని వర్గాలప్రజలు కోరుకుంటున్నారు.

జగన్ పాలనలోనూ, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా.?

వైఎస్ఆర్ సిపి కన్నా మెరుగైన పాలన అందిస్తామని చెప్పే ధైర్యంటిడిపి కి లేదు.

వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు  గర్వపడుతున్నాము.

అర్హులైన ప్రతి ఇంటికీ సంక్షేమ లబ్దిని చేకూర్చినందునే  వై నాట్ 175 అంటున్నామ్..

ఏ రంగాన్ని నిర్లక్షం చేయకుండా అన్ని రంగాల అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న జగన్  ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంతో ప్రజలముందుకు..

పల్లెవెలుగు  వెబ్ నందికొట్కూరు: సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాలప్రజలు కోరుకుంటున్నారని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు.గురువారం నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెం లో  కౌన్సిలర్ చిన్న రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మళ్ళీ సీఎం జగనే ఎందుకు కావాలంటే నిర్వహించిన  సమావేశంలో చైర్మన్ దాసీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  ఏ నాయకుడు చేయని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధితో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలన్న అంశంపైన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు ఈ  నాలుగన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పేందుకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న కార్యక్రమమన్నారు.2019 ఎన్నికల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో చెప్పిన హామీలన్నింటిలో  ఏమేమి నెరవేర్చాము, ఏ ఇంటికి ఏయే సంక్షేమ పథకాలు అందాయి అని ధైర్యంగా ప్రతి గడప కు వెల్లుచున్నామన్నారు. ఏబీఎం పాలెం లోని 1వ 22వ వార్డులో ప్రభుత్వం నవరత్నాల పథకం కింద   ఆమ్మవడి, విద్యాదీవెన, వసతి దీవెన,వైఎస్సార్ ఆసరా, చేదోడు, వాహనమిత్ర, పింఛన్లు, నాడు నేడు, గడపగడప మన ప్రభుత్వం ద్వారా రూ.15,16,83798 లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపారు. అర్హులైనప్రతి ఇంటికీ సంక్షేమ లబ్దిని చేకూర్చినందునే  వై నాట్ 175 అంటున్నామన్నారు.అయితే  టిడిపి వాళ్ళు భవిష్యత్ కు గ్యారంటీ అనే కార్యక్రమం చేపడుతున్నారని, 2014 ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో ని ఇచ్చి  విజయం సాధించి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారన్నారు. ఆ మ్యానిఫెస్టో లో ఎన్ని హామీలు నెరవేర్చారో  ఫలానా వాళ్లకు ఫలానా మేలు చేశామని ప్రతి గడప కు కరపత్రాలను ఇచ్చే దమ్ము, ధైర్యం టిడిపికి ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని టి డి పి వాళ్ళు చెబుతుంటే ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదన్నారు.జగన్ పాలనలోనూ, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని చైర్మన్ సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు ఒక ప్రజాప్ర గర్వపడుతున్నానన్నారు.ఆంధ్ర ప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంతో ప్రజలముందుకు వెళ్ళుచున్నామన్నారు.ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ జగన్ సీఎం చేయాలని కోరారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్షపోగు ప్రశాంతి, జేసీఎస్ కన్వీనర్ అబూబక్కర్, మున్సిపల్ కమిషనర్ కిషోర్, మేనేజర్ మంజునాథ్ గౌడ్, వైఎస్ఆర్సిపి  పట్టణ అధ్యక్షులు మన్సూర్, ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, కౌన్సిలర్లు రావుఫ్, లాలు ప్రసాద్, అల్లూరి కృష్ణ, చాంద్ భాషా, హమీద్ మియా, నాయబ్,  వైసిపి నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బేగ్, సులోచన, శ్రీనివాసులు, అబ్దుల్లా, జబ్బార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

About Author